తలవంచడం కంటే తలెత్తుకుని ఉండడం ఎందుకు కష్టం?
జీవితంలో కొందరు ఎలా ఉంటారంటే…
పరిస్థితులకు తగ్గట్టుగా లొంగిపోతారు…
ఒంగిపోతారు…
అలా ఉంటే వాళ్లకు కంఫర్ట్‌గా ఉంటుంది.
కానీ ఇంకొంతమంది మాత్రం అలా ఉండలేరు…
ఎంత ప్రాబ్లమ్ వచ్చినా…
ఎంత ప్రెషర్ వచ్చినా…
తలవంచడం వాళ్లకి సెట్ అవదు.
వాళ్లు తలనొప్పులు పడతారు…
స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది…
కానీ ఒకటి మాత్రం వదిలిపెట్టరు 👇
స్వాభిమానం
కొంతమందికి
“సరే…, అడ్జస్ట్ అవుదాం” అనిపిస్తుంది…
కానీ ఇంకొంతమందికి మాత్రం
తలనొప్పులు భరించడం ఈజీ…
కానీ తలవంచడం మాత్రం చాలా కష్టం.
అందుకే బయట వాళ్లు చూస్తే…
“వీళ్ళు మూర్ఖులు” అంటారు 😂
కానీ నిజం ఏంటంటే…
వాళ్లు మూర్ఖులు కాదు…
తమ విలువ తెలిసిన వాళ్లు.
జీవితంలో ఒక టైమ్ వస్తుంది…
మనల్ని వంచాలని చాలామంది ప్రయత్నిస్తారు…
అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి 👇
లొంగిపోవాలా?
లేక మనలా నిలబడాలా?
ఎందుకంటే చివరికి…
లొంగి బ్రతికిన జీవితం కంటే
నిలబడి పోరాడిన జీవితం విలువైనది.








