మన లైఫ్‌లో చాలామంది పరిచయం అవుతారు…
కొంతమందిని మనం చాలా దగ్గరవాళ్ళు అనుకుంటాం …
కానీ నిజంగా వాళ్లంతా మన వాళ్లేనా అంటే… కాదు.
చాలామంది మన దగ్గర ఉంటారు…
మన కోసం కాదు… వాళ్ల అవసరాల కోసం.
వాళ్లకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే…
మనకి ఫోన్ చేస్తారు…
బాధలు చెప్పుకుంటారు…
సలహాలు అడుగుతారు…
వాళ్ల గొడవలు కూడా మనమే చూసుకోవాలి 😅
అంతా బాగానే ఉంటుంది…
కానీ ఒకసారి మనకు అవసరం వచ్చినప్పుడు
“నువ్వు నా పక్కన ఉంటావా?” అంటే…
“మధ్యస్థంగా ఉంటాం” అంటారు.
గోడమీద పిల్లులులాగా…
అయితే అదే వాళ్లు
“నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్” అంటారు 🤔😂
అప్పుడు మనకి అర్థమవుతుంది…
👉 ఇది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు
👉 అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే రిలేషన్
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే…
ఇలాంటి ఫ్రెండ్స్‌ని కొనసాగించాలా?
దూరంగా ఉంటే…
“మారిపోయావు” అంటారు
“సెల్ఫిష్ అయిపోయావు” అంటారు
“ఒంటరిగా ఉంటావు” అంటారు…
కానీ ఒక విషయం మాత్రం క్లియర్ 👇
మన విలువ అర్థం చేసుకోని వాళ్ల కోసం
మన సమయం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
స్నేహం అంటే…
అవసరం ఉన్నప్పుడు పక్కన ఉండడం
నిజాయితీగా మనతో ఉండడం
అది లేకపోతే…
అది ఫ్రెండ్షిప్ కాదు… టైంపాస్ మాత్రమే.








