Home Blog కాంతారా హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వేణుగోపాల్ ఎలా చనిపోయారో తెలుసా ?

కాంతారా హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వేణుగోపాల్ ఎలా చనిపోయారో తెలుసా ?

0

సంచలన హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వేణు గోపాల్ జమ్మూ కాశ్మీర్ లోని యూరి సెక్టార్ లో ఆర్మీ ఆఫీసర్ గా పని చేసేవారు. 2007 లో ఒకరోజు సరిహద్దుల్లో ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కొంతమంది ఉగ్రవాదులు అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే ఆయన తన టీం తో కలిసి అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన భీకర కాల్పుల్లో దురదృష్టవశాత్తూ కల్నల్ వేణుగోపాల్ తుపాకీ తూటాలు తగిలి చనిపోయారు. తండ్రి చనిపోయినప్పుడు రుక్మిణి వసంత్ వయస్సు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణంతో ఆమె, ఆమె తల్లి మరియు చెల్లి బాధతో తల్లడిల్లిపోయారు.

తదనంతరం భారతదేశ అత్యున్నత పురస్కారం “అశోక చక్ర ” ఆయనకు లభించింది. కర్ణాటక రాష్ట్రము నుండి అశోక చక్ర వచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన భౌతికకాయానికి మిలటరీ అలంకరణతో, సైనిక లాంఛనాలతో అంత్య క్రియలు జరిగాయి. తాజాగా, కోయంబత్తూర్ లో జరిగిన ఒక ఈవెంట్ లో ఈ సంఘటనను తలచుకుని ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ” నా తండ్రి చనిపోయినప్పుడు నేను చాల చిన్న దాన్ని. ఆయన మరణం మా కుటుంబం పై చాలా తీవ్రమయిన ప్రభావం చూపించింది. ఆ సమయంలో నా తల్లి అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆమె జీవితం మొత్తం శూన్యం గా అయ్యిపోయింది. ఆమె తన భాదను పిల్లలమైన మా కొరకు దిగమింగుకొని ధైర్యం తెచ్చుకొని మమ్ముల్ని ఒక దారి చెయ్యటానికి నిశ్చయించుకుంది. ఆమెకున్న దేశభక్తి చాల గొప్పది. తండ్రి లేని లోటు మాకు తెలియకుండా పెంచింది”

రుక్మిణి వసంత్ తల్లి యుద్ధ సమయంలో భర్తలను కోల్పోయిన వారి కోసం నడిపే “వీర రత్న ఫౌండేషన్ ” లో చాలా యాక్టీవ్ గా తన సేవలను అందిస్తున్నారు. ” మనం అనుభవించిన భాధ, అటువంటి బాధ అనుభవించే ఇతరులతో కలిసి పంచుకుంటే వాళ్ళకి దైర్యం కలుగుతుంది. అమరుల కుటుంబాలతో కలిసి నిర్వహించే మూడు రోజుల వర్కుషాప్ వాళ్ళల్లో చాలా ఓదార్పుని కలిగిస్తుంది. నేను అమ్మ,చెల్లి తో కలిసి ఆ వర్కుషాపులకు హాజరు అయ్యేవాళ్ళం” అని ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంది రుక్మిణి వసంత్.

ఆమె నటించిన “మదరాసి” సినిమా ఇటీవలే విడుదలయ్యింది. రిషబ్ శెట్టి తో కలసి ఆమె నటించిన కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వెయ్యికోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టియార్ నటిస్తున్న “డ్రాగన్” చితం షూటింగ్ లో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here