
నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆమె కెరీర్ లో ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు, కానీ ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. తన కెరీర్ ను గమనిస్తే ఆమె సక్సెస్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు ఘన విజయాలు సాధించాయి. మీడియా ఆమెను తన సక్సెస్ సీక్రెట్ ని గూర్చి అడిగినప్పుడు ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కష్టపడి అందరూ పనిచేస్తారు కానీ దానికి కొంచెం అదృష్టం కూడా తోడయితేనే విజయం వరిస్తుంది అని ఆమె నమ్ముతారు. ఇంతవరకు తాను చేసిన సినిమాలు, ఈ పేరు అదంతా ఏమి ప్లాన్ చేసుకుని చేసినది కాదు అని ఆమె చెప్పారు.ఇంకా ఆమె ఏమని చెప్పారంటే –
కష్టపడేతత్వం :
ఒక్కసారి ఒక సినిమా కమిట్ అయినతరువాత చాలా అంకితభావంతో నా పని నేను చేస్తాను. పని విషయంలో నేనొక సైకోని. అంచనాలకు మించి పని చేయటానికి ప్రాధాన్యత ఇస్తాను.
పనికి న్యాయం చేయాలి :
మన పనికి మనం 100% న్యాయం చెయ్యాలి. మనలోని ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించాలి.
ఆనందంగా జీవించాలి :
జీవితంలో ఎప్పుడూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో ఎన్ని భాదలు ఉన్నా అవి మన పనిలో ఎప్పుడూ కనిపించకూడదు.
అదృష్టం :
మనకు వచ్చిన అవకాశాలను బట్టి కృతజ్ఞత కలిగివుండాలి. నాకు అవకాశాలు రావటం వలన నా ప్రతిభను చూపించుకొనే అవకాశం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి.
వాస్తవాలను అంగీకరించాలి :
జీవితాన్ని ఎప్పుడూ అతిగా ప్లాన్ చేసుకోకూడదు.పరిస్థితులను బట్టి మారి అందుకు అనుగుణముగా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు చూడని అవకాశాలు నీకు కన్పించి అదృష్టం వరిస్తుంది.
రోజులు ఒకేలా ఉండవు :
ఈ రోజు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు అన్ని పోవటానికి ఒక్క క్షణం చాలు, అది మనసులో పెట్టుకుని గర్వం,అహంకారం లేకుండా మన మూలాలను మరచిపోకుండా సాధారణ జీవితం జీవించాలి, అప్పుడు మన చేతిలో లేని ఏదయినా పరిస్థితులవలన, యేమిజరిగినా, మనకు తట్టుకోగలిగే శక్తి ఉంటుంది.