
అక్టోబర్ 23,2025 న రామ్ చరణ్ ఉపాసన కొణిదెల దంపతులు త్వరలో తమ రెండవ సంతానం గా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో “సీమంతం” బేబీ షవర్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసి “ఈ దీపావళికి ప్రేమ,ఆశీస్సులు,వేడుకలు అన్నీ డబల్ అయ్యాయి “అని కాప్షన్ పెట్టారు.తరువాత ఉపాసన తల్లి శోభన కామినేని కూడా త్వరలో కవలలు జన్మిస్తారని ఆశిస్తున్నాము అని ఈ వార్తను ధ్రువీకరించారు.
వీడియోలో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ బేబీ షవర్ వేడుక దీపావళి పండుగ సందర్బములో జరిగాయి ,ఈ వేడుకకు రామ్ చరణ్ తల్లి దండ్రులయిన చిరంజీవి,సురేఖ, మెగా కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున,వెంకటేష్ కుటుంబాలు,ఇతర శ్రేయోభిలాషులు తరలి వచ్చి రామ్ చరణ్ -ఉపాసన దంపతులను ఆశీర్వదించారు. కోడలు రెండోసారి గర్భం ధరించటం తో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు.
2012 లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు మొదటి సంతానంగా క్లిన్ కార కొణెదల జూన్ 2023 లో పెళ్లి అయిన 11 సంవత్సరాల తరువాత జన్మించింది. 2026 లో ఈసారి కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది ఉపాసన. పిల్లలను లేట్ గా కనటం పై ఉపాసన గతంలో ఒకసారి స్పందిస్తూ “పిల్లలను ఎప్పుడు కనాలి అనేది స్త్రీల హక్కు. పూర్తిగా ఆరోగ్యం సహకరించినప్పుడే, శారీరకంగా సిద్దపడి, డాక్టర్ సలహాతో పిల్లలను ప్లాన్ చేసుకోవాలి. నేను ఆరోగ్యంగా సిద్ధంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాతో తప్పకుండా మళ్ళీ పిల్లలను కంటాను” అన్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సానా డైరెక్షన్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం “పెద్ది” షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. గతంలో క్లిన్ కార పుట్టినప్పుడు సినిమాలకు కొంత సమయం విరామం ఇచ్చి సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు రామ్ చరణ్. ఈసారి కూడా “పెద్ది “సినిమా పూర్తి చేసిన తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొనే అవకాశం ఉంది.