Home Blog Page 2

మరోసారి హిట్ పెయిర్ బాలయ్య – నయనతార జోడి !

0

వరుస బహుభాషా చిత్రాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతుంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తదుపరి చిత్రం #ఎన్ బి కే 111 లో నయనతార హీరోయిన్ గా, బాలయ్యకు పెయిర్ గా నటించడానికి సైన్ చేసారు అనే వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హిస్టారికల్ కధాంశంతో తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ లో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రకటించి ప్రారంభించబోతున్నారు.

వీరసింహారెడ్డిఅనంతరం మరోసారి బాలయ్యగోపీచంద్ కాంబో

గోపీచంద్ మలినేని టీం తో బాలయ్య చేస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందువలన #ఎన్ బి కే 111 పై కూడా చాల అంచనాలువుంటాయి. వాటిని అందుకోవటానికి సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ లో చిత్రీకరణకు అవసరమైన లొకేషన్ల వేటలో చిత్ర యూనిట్ ఉంది.

చారిత్రాత్మక కథతో మొదటిసారి రాబోతున్న గోపీచంద్ మలినేని

ఇంతవరకూ గోపీచంద్ మలినేని తెరకెక్కించినవన్ని కమర్షియల్ చిత్రాలు, మొదటిసారిగా చారిత్రాత్మక కధకు దర్శకత్వం వహించబోతున్నారు మలినేని. ఈ చిత్రం తనకు బాగా అలవాటయిన మాస్ టచ్ తో చారిత్రాత్మకమైన ఒక కథతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఫాన్స్ ని పలకరించబోతున్నారు మలినేని. ఈ సినిమాలో బాలయ్య గెట్అప్ కూడా ఇంతవరకు ఎవరు చూడని విధంగా ఉండి యాక్షన్, ఎమోషన్, డ్రామా తో చాల రిచ్ గా తెరకెక్కబోతుంది.

బలమైన పాత్ర పోషిస్తున్న నయనతార

గతం లో బాలయ్య నయనతార కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, శ్రీ రామరాజ్యం సినిమాలు మంచి విజయం సాధించడం తో ఫాన్స్ లో ఈ చిత్రం పట్ల చాల అంచనాలు పెరిగిపోతున్నాయి. నయనతార ఒక సినిమా ఓకే చేసారంటే అందులో ఆమెది ఒక బలమైన పాత్ర అయ్యిఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా స్త్రీ శక్తిని, చారిత్రాత్మక కధలో ఆమె చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో #ఎన్ బి కే 111 సినిమా చాలా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు.

20 రూపాయల సమోసానా? 3 లక్షల యాంజియోప్లాస్టినా? ఢిల్లీ గుండె జబ్బుల డాక్టర్ మాస్ వార్నింగ్

0

మనలో కొంతమంది ఆఫీసులో సాయంత్రం స్నాక్స్ లాగ కాంటీన్ నుండి సమోసాలు తెప్పించుకుని తినే అలవాటు ఉంటుంది.కొన్ని ఆఫీసులు లో అయితే వాళ్లే సమోసాలు తెప్పించి ఉద్యోగులకు స్నాక్స్ లాగ ఇస్తూఉంటారు. ఇలా రోజు సమోసాలు తినటం ఆరోగ్యానికి మంచిదేనా? దాని పర్యవసానాలు ఎలాఉంటాయి?

ఢిల్లీకి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ శైలేష్ సింగ్ ఈ అనారోగ్యకరమయిన అలవాటును గూర్చి ఒక ట్వీట్ చేసారు.ఫన్నీ గా ఉంటూనే డాక్టర్ ఇచ్చిన స్వీట్ హెల్త్ వార్నింగ్ క్షణాల్లో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. డాక్టర్ సింగ్ ఏమన్నాడంటే – “ఒక సమోసా ఖరీదు 20 రూపాయలు అయితే దానిని ప్రతిరోజూ తినే వ్యక్తి సంవత్సరానికి 300 సమోసాలు తింటాడు. అలా 300 x 20= 6000 రూపాయలు సంవత్సరానికి అవుతాయి. అలా 15 సంవత్సరాలు తింటే 6000 x 15 = 90 వేలు అవుతాయి. ఈ 90 వేలు మీరు అనారోగ్యకరమయిన ఆహారం మీద తీసుకున్న లోన్ దానికి 400 శాతం వడ్డీ అదనం. అలా అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ వలన వచ్చే గుండె జబ్బులకు చికిత్స అయిన యాంజియోప్లాస్ట్య్ కొరకు మీరు చెల్లించవలసిన బాకీ మొత్తం వడ్డీతో కలిపి 3 లక్షలు అవుతుంది”

ఆరోగ్యానికి సంబందించిన నిర్ణయాలను వాయిదా వేయటం, ఈ ప్రాజెక్ట్ అయినతరువాత చూద్దాం, రిటైర్ అయ్యాక హెల్త్ మీద ఫోకస్ చేద్దాం అని విలువయిన సమయం వృధా చేయటం వలన మన శరీరంలో అనారోగ్యం పేరుకు పోతుంది. అనారోగ్యం పాలయినాక ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించే కంటే ముందే మేలుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కు, మెడికల్ మాఫియాకు మనం ఏటీఎమ్ లాగా మారకుండా ఉంటాము.

మనం తీసుకొనే ఆహరం మీద శరీరంలో కొలస్ట్రాల్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువుగా నూనె,మసాలా కలిగిన ఆహారాల వలన, ఒత్తిడి వలన కొలస్ట్రాల్ పెరిగి కాలేయం, గుండె వ్యాధులు వస్తాయి. శారీరిక శ్రమ, నడక, ఒత్తిడి తగ్గించుకోవటం, మంచి సమతుల్య ఆహరం వలన మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఈ సీనియర్ కార్డియోలాజిస్ట్ వైద్యుడు డాక్టర్ సింగ్ చెప్పినది కూడా అక్షరాలా వాస్తవం.

మెగా సంబరం-ట్విన్స్ కు జన్మనివ్వబోతున్న రామ్ చరణ్ దంపతులు

0

అక్టోబర్ 23,2025 న రామ్ చరణ్ ఉపాసన కొణిదెల దంపతులు త్వరలో తమ రెండవ సంతానం గా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో “సీమంతం” బేబీ షవర్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసి “ఈ దీపావళికి ప్రేమ,ఆశీస్సులు,వేడుకలు అన్నీ డబల్ అయ్యాయి “అని కాప్షన్ పెట్టారు.తరువాత ఉపాసన తల్లి శోభన కామినేని కూడా త్వరలో కవలలు జన్మిస్తారని ఆశిస్తున్నాము అని ఈ వార్తను ధ్రువీకరించారు.

వీడియోలో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ బేబీ షవర్ వేడుక దీపావళి పండుగ సందర్బములో జరిగాయి ,ఈ వేడుకకు రామ్ చరణ్ తల్లి దండ్రులయిన చిరంజీవి,సురేఖ, మెగా కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున,వెంకటేష్ కుటుంబాలు,ఇతర శ్రేయోభిలాషులు తరలి వచ్చి రామ్ చరణ్ -ఉపాసన దంపతులను ఆశీర్వదించారు. కోడలు రెండోసారి గర్భం ధరించటం తో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు.

2012 లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు మొదటి సంతానంగా క్లిన్ కార కొణెదల జూన్ 2023 లో పెళ్లి అయిన 11 సంవత్సరాల తరువాత జన్మించింది. 2026 లో ఈసారి కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది ఉపాసన. పిల్లలను లేట్ గా కనటం పై ఉపాసన గతంలో ఒకసారి స్పందిస్తూ “పిల్లలను ఎప్పుడు కనాలి అనేది స్త్రీల హక్కు. పూర్తిగా ఆరోగ్యం సహకరించినప్పుడే, శారీరకంగా సిద్దపడి, డాక్టర్ సలహాతో పిల్లలను ప్లాన్ చేసుకోవాలి. నేను ఆరోగ్యంగా సిద్ధంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాతో తప్పకుండా మళ్ళీ పిల్లలను కంటాను” అన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సానా డైరెక్షన్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం “పెద్ది” షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. గతంలో క్లిన్ కార పుట్టినప్పుడు సినిమాలకు కొంత సమయం విరామం ఇచ్చి సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు రామ్ చరణ్. ఈసారి కూడా “పెద్ది “సినిమా పూర్తి చేసిన తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొనే అవకాశం ఉంది.

ప్రేమ ఎటువంటి వ్యక్తినయినా మార్చగలదు – రష్మిక మందన్న.

0

ఒకరిపై మరొకరికి సమానమైన ప్రేమ ఉంటె ఒకరికి తగ్గట్టుగా మరొకరు తప్పకుండా మారతారు.అందుకు మారాలి అని నిజాయితీగా ప్రయత్నం చేయాలి,అమ్మాయిలయినా అబ్బాయిలయినా తప్పకుండ మారతారు. ఒకరిపై మరొకరికి తగినంత ప్రేమ ఉండాలి.ఒక్కరే మారితే ప్రయోజనం లేదు,ఇద్దరూ మారాలి.దానికి సులువయినా మార్గం ఏమిటంటే రెండు మనసులూ కలిసి ఒక్కటిగా మారటమే.
– రష్మిక మందన్న.
జులై 2025 లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నటి రష్మిక మందన్న మాట్లాడుతూ,ఈ వ్యాఖ్యలు చేసారు.ప్రేమను గూర్చి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటంతో అవి సహజంగా మీడియా దృష్టిని ఆకర్షించాయి.అయితే రష్మిక ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణం ఏమిటంటే సాధారణంగా రష్మిక మీడియా తో చాల ఫ్రెండ్లీగా ,అందుబాటులో ఉండి చాల విషయాలు పంచుకుంటూ ఉంటారు.ఇటువంటి మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా ఆమె నటించిన “యానిమల్ “సినిమాలోని రణబీర్ కపూర్ పాత్రను గూర్చి మీడియా ప్రశ్నిస్తూ “యానిమల్ సినిమాలోని రణ విజయ్ లాంటి వ్యక్తితో ఎప్పుడయినా డేటింగ్ చేస్తారా?”అని అడిగారు.ఆ పాత్ర చాల క్రూరంగా,దూకుడుగా,హింసాత్మకంగా ఉంటుంది.
ఈ ప్రశ్నకు ఆమె బదులిస్తూ ,ఇద్దరు వ్యక్తులు నిజంగా,నిజాయితీగా,సమంగా ప్రేమించుకుంటే కాల క్రమములో వారి వ్యక్తిత్వములో మార్పులు జరుగుతాయని,ఒకరికోసం మరొకరు తప్పకుండ మారతారని రష్మిక స్పందిస్తూ చెప్పింది.కలిసి ఉన్నప్పుడు ఒకరి బలహీనతలు మరొకరు తెలుసుకుంటారని వ్యక్తిత్వములో మార్పులు వస్తాయని సర్దుబాటు చేసుకోవటం కూడా అలవాటు అవుతుందని ఆమె వివరించింది.
ప్రేమ ఎటువంటి వ్యక్తినయినా మార్చగలదని హీరోయిన్ రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవటం వలన చాలామంది నెటిజనులు స్పందిస్తున్నారు.చాలామంది ఆమె వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు.
రష్మిక తన సహా నటుడు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తల మధ్య అక్టోబర్ 2025 లో ఆమె చేసిన ఈ కామెంట్స్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి.అయితే తమ నిశ్చితార్ధాన్ని విజయ్ దేవరకొండ కానీ,రష్మిక గాని ఇంతవరకు ధ్రువీకరించలేదు.కానీ వారి అభిమానులలో మాత్రం వాళ్ళ సంబంధం పట్ల చాల ఆసక్తి నెలకొని ఉంది.

ఆపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ అంతిమ ఘడియల్లో వ్రాసిన ఈమెయిల్

0

స్టీవ్ జాబ్స్ : సెప్టెంబర్ 2,2010

నేను ఆహారాన్ని తినటం ద్వారా బలం పొంది జీవిస్తాను. నా కోసం ఎవరో విత్తనాలు నాటి పంటలు పండించి ఆహారాన్ని నాకు అందిస్తున్నారు.

నేను ధరించే దుస్తులను ఎవరో నా కోసం అందిస్తున్నారు.

నేను మాట్లాడే బాష ఎవరో నా కొరకు కనిపెట్టి రోజురోజుకీ ఇంకా మెరుగు పరుస్తున్నారు.

నేను ప్రతిరోజూ అనేక విషయాలకు ఉపయోగించే గణితాన్ని లెక్కలను నా కొరకు ఎవరో కనుకొన్నారు.

నేను ఈరోజు స్వేచ్ఛగా జీవించడానికి చట్టాలను,న్యాయాలను,రాజ్యాన్ని,రక్షణను,భద్రతను నాకోసం ఎవరో రూపొందించారు.

నాకెంతో ఇష్టమయిన,నాకెంతో ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని నా కోసం ఎవరో రూపొందించారు.

నాకు వైద్యసహాయం అవసరమయినప్పుడు,అనారోగ్యముతో నిస్సహాయముగా పడిఉన్నప్పుడు,ఎవరో నాకొరకు వైద్యసహాయం అందించి నేను జీవించడానికి తోడ్పడుతున్నారు.

నేను రోజు పనిచేసే కంప్యూటర్,టెక్నాలజీ లను,యంత్రాలను నాకోసం ఎవరో కనిపెట్టారు.

నా శ్రేయస్సు కోసం నేను ఆధారపడిన వాటిని కనిపెట్టిన నా పూర్వికులు మరియు ఇప్పటికి బ్రతికున్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నాను…ఆరాధిస్తున్నాను.

(స్టీవ్ జాబ్స్ తన వ్యక్తిగత ఆపిల్ ఐడి నుండి తన వ్యక్తిగత ఈమెయిల్ కు ఈమెయిల్ పంపుకున్నారు.బహుశా ఇదే తన చివరి ఘడియల్లో తన అంతరంగం అయి ఉండవచ్చు.)