నగలు వేసుకొవటం వలన నా పై చాలా ట్రోలింగ్ జరిగింది. ఎందుకు ఇప్పుడు.. అవసరమా..హారాలు వేసుకోవటం అన్నారు. పూర్వ కాలంలో మొగవాళ్ళు కూడా నగలు వేసుకొనేవాళ్ళు. ఇప్పుడు అయితే చాలా తేడాలు వచ్చేసాయి . పింక్ అంటే ఆడవాళ్లకు..బ్లూ అంటే మొగవాళ్లకు అంట. నేను అవన్నీ పట్టించుకోను. నేను ఎం ధరించాలి అనుకుంటానో ..అవే ధరిస్తాను.. – అల్లు శిరీష్
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఇటీవల తన నిశ్చితార్థం మరియు పెళ్లి వేడుకల్లో వేసుకున్న ఆభరణాల కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యాడు. అయితే ఈ విషయంపై ఆయన చాలా సింపుల్‌గా స్పందించారు.
అక్టోబర్ 2025లో Nayanika Reddyతో జరిగిన నిశ్చితార్థంలో అల్లు శిరీష్ ఒక చోకర్ నెక్లెస్ వేసుకున్నారు. అలాగే పెళ్లి వేడుకల్లో కూడా బంగారం, వజ్రాలతో చేసిన కొన్ని ఆభరణాలు ధరించారు.
దీనిపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి. కొందరు సరదాగా ట్రోల్ కూడా చేశారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ ఈ విషయంపై మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ,
“ఒక మగవాడిని ఎలా ఉండాలో ఇతరులు నిర్ణయించలేరు” అని చెప్పారు.
పాత కాలంలో కూడా పురుషులు ఆభరణాలు వేసుకునేవారని ఆయన గుర్తు చేశారు. రాజులు, మహారాజులు కూడా నెక్లెస్‌లు, ఇతర ఆభరణాలు ధరించేవారని చెప్పారు.
“ఇప్పుడు మాత్రమే అబ్బాయిలకు ఇది, అమ్మాయిలకు అది అనేలా చాలా నియమాలు పెట్టుకున్నాం. కానీ పాత కాలంలో అలా ఉండేది కాదు” అని శిరీష్ అన్నారు.
మొదట్లో తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ విషయంపై ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు.
“ఇప్పుడు నెక్లెస్ వేసుకోవాలా అని కొందరు అడిగారు. కానీ మనం కూడా కొత్తగా ట్రై చేయకపోతే మార్పు ఎలా వస్తుంది?” అని ఆయన చెప్పారు.
నిశ్చితార్థం తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఒక మీమ్‌లో శిరీష్ పెళ్లికి వడ్డాణం కూడా వేస్తారని సరదాగా చూపించారు.
దానికి స్పందిస్తూ ఆయన నవ్వుతూ,
“మన తెలుగు మీమర్స్ చాలా ఫన్నీగా ఉంటారు” అని చెప్పారు.
అలాగే భారతదేశంలో పాత కాలంలో మహారాజులు కూడా అనేక రకాల ఆభరణాలు వేసుకునేవారని గుర్తు చేశారు.
ఇలా అల్లు శిరీష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. కొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.








