Home Blog మా కుటుంబంలో మెర్సిడెస్ బెంజ్ కారును కలిగి ఉన్న మొదటి వ్యక్తిని నేనే – మృణాల్ ఠాకూర్

మా కుటుంబంలో మెర్సిడెస్ బెంజ్ కారును కలిగి ఉన్న మొదటి వ్యక్తిని నేనే – మృణాల్ ఠాకూర్

0

“హాయ్ నాన్న” , “సీత రామం” సినిమాలలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ తెరపై తన నటనతో ప్రేక్షకులవద్ద మంచి పేరు సంపాదించారు. ఇటీవల మీడియా తో జరిగిన సంభాషణలో, ఆమె తన బాల్యాన్ని గూర్చి కొన్ని సంఘటనలను, తన కుటుంబంతో తనకున్న సన్నిహిత బంధం, కార్ల పట్ల తనకున్న ప్రేమను గూర్చి ముచ్చటించారు.అలాగే, తాను చిన్నతనంలో తన తల్లికి ఇచ్చిన వాగ్దానం ఆధారంగా తాను కొనుగోలు చేసిన మొదటి లగ్జరీ కారు వెనుక ఉన్న కథ గురించి వెల్లడించారు.

తన టీనేజ్ తొలినాళ్లలోని ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, మృణాల్ ఇలా చెప్పారు,, “నాకు కార్లంటే అంత పిచ్చి ఎందుకు అంటే, దానికి మా అమ్మ ఒక కారణం. నాకు 12 లేదా 13 ఏళ్ల వయసులో, ఆమెను మా బంధువుల కార్లలో కూర్చోనివ్వలేదు, అందుకు నేను చాల భాధ పడ్డాను. ఆ క్షణం నాలో నేను ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నాను. ఎప్పటికైనా నీ కొరకు ఒక మంచి కారును నేను కొంటాను, అని మనసులోనే మా అమ్మకు మాటిచ్చాను.”

ఫిబ్రవరి 2023లో, తన కల నెరవేరింది. మృణాల్ తన తల్లికి మెర్సిడెస్ లగ్జరీ కార్ ని బహుమతిగా ఇచ్చినప్పుడు, షోరూం లోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లి కూతుర్లు ఒకరిని ఒకరు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబంలో మెర్సిడెస్ కారును కలిగి ఉన్న మొదటి అమ్మాయి ఆమే. ప్రస్తుత సమాజంలో బంధువుల మధ్యలో కూడా డబ్బుఉన్నవాళ్లకు ఒక రకమైన విలువ, లేనివాళ్లకు మరొక రకమైన విలువ ఇవ్వటం, మనం చూస్తున్నాం. డబ్బుని బట్టి కానీ, విలువైన వస్తువులను బట్టి గాని, మనుష్యులకు విలువ ఇవ్వటం అనేది తప్పు. మనిషిని మనిషిగా గౌరవించని వాళ్ళు కనీస సంస్కారం లేని వాళ్ళుగా మిగిలిపోతారు.

మృణాల్ కెరీర్ గురించి చెప్పాలంటే, 32 ఏళ్ల ఈ నటి చివరిసారిగా నాగ్ అశ్విన్ కల్కి 2898 AD లో అతిధి పాత్రలో కనిపించింది. ఆమె చేతిలో మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న “పూజా మేరీ జాన్ ” మరియు అడివి శేష్ తో కలిసి నటిస్తున్న “డకాయిట్ ” వంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here