Home Blog స్కూల్ పరీక్ష వ్రాయటానికి గడ్డకట్టే మంచులో కొన్ని మైళ్ళు నడచివెళ్లిన విద్యార్థి. తలనిండా మంచుతో శరీరమంతా ఎర్రబారినా 100/99 మార్కులు సాధించాడు

స్కూల్ పరీక్ష వ్రాయటానికి గడ్డకట్టే మంచులో కొన్ని మైళ్ళు నడచివెళ్లిన విద్యార్థి. తలనిండా మంచుతో శరీరమంతా ఎర్రబారినా 100/99 మార్కులు సాధించాడు

0

చైనాకు చెందిన ఒక పేద స్కూల్ విద్యార్థి కథ మరియు అతని ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. చైనాలోని యునాన్ గ్రామీణ ప్రాంతంలో నివసించే ఈ బాలుడు పేరు వాంగ్ ఫుమాన్. -9 డిగ్రీల సెల్సీయస్ చలిలో అడుగు తీసి అడుగు వేస్తే కూరుకుపోయే మంచులో, గడ్డకట్టే చలిలో, దాదాపు 5 కిలోమీటర్లు ఈ బాలుడు నడుచుకుంటూ వెళ్లి తన స్కూలు పరీక్ష వ్రాశాడు. అక్కడికి వెళ్లేసరికి అతని తల మొత్తం తెల్లటి మంచుతో కప్పబడినా, శరీరమంతా ఎర్రగా కందిపోయినా చదువుపట్ల ఆ విద్యార్థి చూపిన ఇష్టాన్ని చూసి ఇప్పుడు అందరూ ముద్దుగా “ఐస్ బాయ్” అని పిలుచుకుంటున్నారు. అంతటి క్లిష్ట పరిస్థితులలో ఆ బాలుడు పరీక్షా వ్రాసినా 100 కి 99 మార్కులు సాధించటం విశేషం.

అతని ఫోటో వైరల్ అవ్వటంతో కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా స్పందించి దాదాపు 4,50,000 డాలర్లను అతని స్కూల్లో హీటర్లు పెట్టటానికి,మరికొన్ని సదుపాయాలకు అలాగే అతనిలాంటి పేద విద్యార్థులకు సహాయంగా అందించారు.

తరువాత ఆ బాలుడు బీజింగ్ ని సందర్శించినప్పుడు అక్కడ ఎండ వేడిని చూసి “వెచ్చదనం ఒక అద్భుతం” అని ఆశ్చర్యంతో వ్యాఖ్యానించాడు. మనకు ప్రకృతి ఎన్నో ఉచితంగా ఇస్తూ ఉంటుంది, కనీసం అటువంటి వాటికి కూడా నోచుకోనివారు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. గడ్డకట్టిన మంచు మీదుగా ప్రతిఫలించిన, ఈ పిల్లవాడు చదువుకోసం చేసిన పోరాటం ప్రపంచం యావత్తునూ కదిలించింది. కృషి,పట్టుదల ఉంటె సాధించలేనిది ఏమి ఉండదని, చదువు విలువని వాంగ్ ఫుమాన్ తెలియచేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here