Home Blog 20 రూపాయల సమోసానా? 3 లక్షల యాంజియోప్లాస్టినా? ఢిల్లీ గుండె జబ్బుల డాక్టర్ మాస్ వార్నింగ్

20 రూపాయల సమోసానా? 3 లక్షల యాంజియోప్లాస్టినా? ఢిల్లీ గుండె జబ్బుల డాక్టర్ మాస్ వార్నింగ్

0

మనలో కొంతమంది ఆఫీసులో సాయంత్రం స్నాక్స్ లాగ కాంటీన్ నుండి సమోసాలు తెప్పించుకుని తినే అలవాటు ఉంటుంది.కొన్ని ఆఫీసులు లో అయితే వాళ్లే సమోసాలు తెప్పించి ఉద్యోగులకు స్నాక్స్ లాగ ఇస్తూఉంటారు. ఇలా రోజు సమోసాలు తినటం ఆరోగ్యానికి మంచిదేనా? దాని పర్యవసానాలు ఎలాఉంటాయి?

ఢిల్లీకి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ శైలేష్ సింగ్ ఈ అనారోగ్యకరమయిన అలవాటును గూర్చి ఒక ట్వీట్ చేసారు.ఫన్నీ గా ఉంటూనే డాక్టర్ ఇచ్చిన స్వీట్ హెల్త్ వార్నింగ్ క్షణాల్లో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. డాక్టర్ సింగ్ ఏమన్నాడంటే – “ఒక సమోసా ఖరీదు 20 రూపాయలు అయితే దానిని ప్రతిరోజూ తినే వ్యక్తి సంవత్సరానికి 300 సమోసాలు తింటాడు. అలా 300 x 20= 6000 రూపాయలు సంవత్సరానికి అవుతాయి. అలా 15 సంవత్సరాలు తింటే 6000 x 15 = 90 వేలు అవుతాయి. ఈ 90 వేలు మీరు అనారోగ్యకరమయిన ఆహారం మీద తీసుకున్న లోన్ దానికి 400 శాతం వడ్డీ అదనం. అలా అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ వలన వచ్చే గుండె జబ్బులకు చికిత్స అయిన యాంజియోప్లాస్ట్య్ కొరకు మీరు చెల్లించవలసిన బాకీ మొత్తం వడ్డీతో కలిపి 3 లక్షలు అవుతుంది”

ఆరోగ్యానికి సంబందించిన నిర్ణయాలను వాయిదా వేయటం, ఈ ప్రాజెక్ట్ అయినతరువాత చూద్దాం, రిటైర్ అయ్యాక హెల్త్ మీద ఫోకస్ చేద్దాం అని విలువయిన సమయం వృధా చేయటం వలన మన శరీరంలో అనారోగ్యం పేరుకు పోతుంది. అనారోగ్యం పాలయినాక ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించే కంటే ముందే మేలుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కు, మెడికల్ మాఫియాకు మనం ఏటీఎమ్ లాగా మారకుండా ఉంటాము.

మనం తీసుకొనే ఆహరం మీద శరీరంలో కొలస్ట్రాల్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువుగా నూనె,మసాలా కలిగిన ఆహారాల వలన, ఒత్తిడి వలన కొలస్ట్రాల్ పెరిగి కాలేయం, గుండె వ్యాధులు వస్తాయి. శారీరిక శ్రమ, నడక, ఒత్తిడి తగ్గించుకోవటం, మంచి సమతుల్య ఆహరం వలన మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఈ సీనియర్ కార్డియోలాజిస్ట్ వైద్యుడు డాక్టర్ సింగ్ చెప్పినది కూడా అక్షరాలా వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here