
వరుస బహుభాషా చిత్రాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతుంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తదుపరి చిత్రం #ఎన్ బి కే 111 లో నయనతార హీరోయిన్ గా, బాలయ్యకు పెయిర్ గా నటించడానికి సైన్ చేసారు అనే వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హిస్టారికల్ కధాంశంతో తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ లో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రకటించి ప్రారంభించబోతున్నారు.
“వీరసింహారెడ్డి” అనంతరం మరోసారి బాలయ్య–గోపీచంద్ కాంబో
గోపీచంద్ మలినేని టీం తో బాలయ్య చేస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందువలన #ఎన్ బి కే 111 పై కూడా చాల అంచనాలువుంటాయి. వాటిని అందుకోవటానికి సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ లో చిత్రీకరణకు అవసరమైన లొకేషన్ల వేటలో చిత్ర యూనిట్ ఉంది.
చారిత్రాత్మక కథతో మొదటిసారి రాబోతున్న గోపీచంద్ మలినేని
ఇంతవరకూ గోపీచంద్ మలినేని తెరకెక్కించినవన్ని కమర్షియల్ చిత్రాలు, మొదటిసారిగా చారిత్రాత్మక కధకు దర్శకత్వం వహించబోతున్నారు మలినేని. ఈ చిత్రం తనకు బాగా అలవాటయిన మాస్ టచ్ తో చారిత్రాత్మకమైన ఒక కథతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఫాన్స్ ని పలకరించబోతున్నారు మలినేని. ఈ సినిమాలో బాలయ్య గెట్అప్ కూడా ఇంతవరకు ఎవరు చూడని విధంగా ఉండి యాక్షన్, ఎమోషన్, డ్రామా తో చాల రిచ్ గా తెరకెక్కబోతుంది.
బలమైన పాత్ర పోషిస్తున్న నయనతార
గతం లో బాలయ్య నయనతార కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, శ్రీ రామరాజ్యం సినిమాలు మంచి విజయం సాధించడం తో ఫాన్స్ లో ఈ చిత్రం పట్ల చాల అంచనాలు పెరిగిపోతున్నాయి. నయనతార ఒక సినిమా ఓకే చేసారంటే అందులో ఆమెది ఒక బలమైన పాత్ర అయ్యిఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా స్త్రీ శక్తిని, చారిత్రాత్మక కధలో ఆమె చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో #ఎన్ బి కే 111 సినిమా చాలా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు.