“డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేద్దాం… అవసరం లేని ఖర్చులు తగ్గిద్దాం…”
అని చెప్పే నాన్న… మనకి చాలాసార్లు హిట్లర్‌లా కనిపిస్తాడు.
మన కోరికలు వెంటనే నెరవేర్చకపోతే —
అతన్ని మూర్ఖుడు అంటాం… చేతకానోడని అనుకుంటాం…
మన ఫ్రెండ్స్ నాన్నలతో పోల్చి చిన్నచూపు చూస్తాం.
కానీ…
అదే నాన్న అప్పు చేసి అయినా మన కోరికలు తీర్చేస్తే?
“మా నాన్న లాంటి వాడు ఎవరూ లేరు”
“మా నాన్న గ్రేట్” అని గర్వంగా చెప్పుకుంటాం.
👉 నిజానికి ఇక్కడే మనం పెద్ద తప్పు చేస్తున్నాం.
అప్పులతో వచ్చే ఆనందం తాత్కాలికం…
కానీ వాటి భారాన్ని మోసేది భవిష్యత్తు.
ఒకసారి ఊహించండి…
అప్పులు చేసి, సరదాలు ఇచ్చిన ఆ నాన్న అకస్మాత్తుగా మనల్ని వదిలేసాడు అనుకోండి…
ఆ రోజు నుంచి —
ఆదాయం లేదు…
అప్పులు మాత్రం ఉన్నాయి…
బాధ్యతలు ఒక్కసారిగా మన మీద పడతాయి…
అప్పుడు మొదలవుతుంది అసలు జీవితం.
అప్పుడే అర్థమవుతుంది —
పొదుపు అంటే ఏమిటో…
బాధ్యత అంటే ఎంత భారమో…
నాన్న ఎందుకు “లేదు” అన్నాడో…
ఇంట్లో ఉన్న వాళ్లకి పస్తులు లేకుండా పప్పన్నం పెట్టే నాన్న గొప్పవాడా?
లేక “నేను ఉంటే బిర్యానీ పెడతా” అని మాటలతో మాయ చేసే వాడా?
👉 నిజం ఒక్కటే —
బాధ్యతతో జీవించే వాడే నిజమైన హీరో.
మనకి కఠినంగా కనిపించినా…
మన భవిష్యత్తు కోసం “లేదు” అని చెప్పగలిగే నాన్న…
మన జీవితంలో ఉన్న అతి పెద్ద ఆశీర్వాదం.
💯 ప్రేమ అంటే కోరికలు తీర్చడం కాదు…
జీవితాన్ని నిలబెట్టడం.







