గ్యాస్ లేదు… ధరలు పెరుగుతున్నాయి… సామాన్యుడి పరిస్థితి ఏంటి?

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే…
పనిలేనోడు పిల్లి తల గొరిగాడన్నట్టు…
బయట దేశాల రాజకీయాలు ఒకపక్క, మన సమస్యలు ఒకపక్క.

మనకి ముఖ్యమైంది ఏమిటి?
రోజువారీ జీవితం సాఫీగా నడవడం.


⛽ గ్యాస్ పరిస్థితి

గ్యాస్ బుక్ చేయాలంటే
👉 25 రోజుల గ్యాప్ ఉండాలి అంటున్నారు

కానీ…
👉 బుక్ చేసిన గ్యాస్ రావడానికి 15–20 రోజులు పడుతోంది

అంటే ఏంటి?
👉 అవసరం ఉన్నప్పుడు గ్యాస్ ఉండదు

అందుకే ప్రజలు
👉 ముందుగానే బుక్ చేసి ఒక సిలెండర్ స్పేర్ పెట్టుకుంటున్నారు


🔥 మళ్లీ పొగలో వంట

ముందు ఏమన్నారు?
👉 పొగ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి
👉 అందుకే గ్యాస్ ఇస్తున్నాం అన్నారు

ఇప్పుడు పరిస్థితి ఏమిటి?
👉 గ్యాస్ లేదు… మళ్లీ కట్టెలతో వండుకోవాలి

ఇది సరైన ప్లాన్ కాదు కదా?

నిజానికి
👉 పొగ రాకుండా ఎలా వండాలో నేర్పించాలి
👉 ప్రత్యామ్నాయాలు చూపించాలి


🍳 మన అలవాటు

మనకు గ్యాస్ మీదే పూర్తి ఆధారం అయిపోయింది

కానీ బయట దేశాల్లో చాలామంది
👉 ఇంకా కట్టెలతోనే వంట చేస్తున్నారు

కానీ వాళ్లు
👉 పొగ బయటకు వెళ్లేలా సిస్టమ్ పెట్టుకుంటారు

మన దగ్గర ఆ ఆలోచన లేదు.


🛑 చిన్న వ్యాపారాల కష్టం

రోడ్డు పక్కన ఉండే
👉 టిఫిన్ సెంటర్లు
👉 పకోడి బండ్లు

గ్యాస్ లేక
👉 చాలావరకు మూసివేశారు

రాజస్థాన్, యూపీ నుంచి వచ్చిన వాళ్లు
👉 పని లేక ఖాళీగా తిరుగుతున్నారు

వాళ్ల మాటల్లో సింపుల్‌గా:
👉 “గ్యాస్ లేదు అన్నా…”


💸 పెట్రోల్ ధరలు

ఇటీవల
👉 పెట్రోల్ ధర ₹2.26 పెరిగింది

ఇది చూస్తే
👉 ఇంకెంత పెరుగుతుందో అనిపిస్తోంది


🤔 చివరగా

మనకు పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు…
👉 గ్యాస్ టైమ్‌కు రావాలి
👉 ధరలు కంట్రోల్‌లో ఉండాలి

ఇవి సెట్ అయితే
👉 జీవితం సులభంగా ఉంటుంది

కానీ ఇప్పుడైతే…
👉 సామాన్యుడికి జీవితం కాస్త కష్టంగా మారుతోంది.

V1 News
Author: V1 News

0
0

Leave a Comment