మా ఇంట్లో అన్ని మతాలు ఉన్నాయి. నా ఇద్దరు కోడళ్ళు బ్రాహ్మిణ్స్ , నేను క్రిస్టియన్. వాళ్ళు ఇద్దరూ పూజలు చేసుకుంటారు, నేను ప్రేయర్ చేసుకుంటా. నాకు ఎలాంటి వ్యత్యాసం లేదు. మన ప్రేయర్ పక్క వాళ్ళను డిస్టర్బ్ చేసేలా ఉండకూడదని నా ఒపీనియన్. మా కమ్యూనిటీ లో ప్రేయర్ మీటింగ్స్ పెట్టి, మైక్ లు పెట్టి, కేకలు పెడుతుంటారు. ఆలా నాకు ఇష్టం ఉండదు. – యాక్టర్ జీవా
టాలీవుడ్ సీనియర్ విలన్ కం క్యారక్టర్ ఆర్టిస్ట్ జీవా గత 40 సంవత్సరాలుగా తన నటనా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విలక్షణమైన నటనా శైలి మరియు డైలాగ్ డెలివరీ కలిగిన జీవా తెలుగు, హిందీ మరియు ఇతర భాషల్లో కలిపి సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించారు.
ఈ మధ్య ఐ డ్రీమ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
జీవా క్రిస్టియన్ మతానికి చెందినవారు. ఆయన ఇద్దరు కోడళ్ళు హైందవ బ్రాహ్మణులు . ఆయన అన్ని మతాలను గౌరవిస్తారు. పెద్ద పెద్ద మైక్ లు పెట్టి దేవుళ్ళని కొలవటం, ఇతరుల ప్రశాంతతను చెడకొడుతుంది, అలాగే భక్తి భావన కలగదు. తాజాగా మైక్ ల వలన కలిగే సౌండ్ పొల్యూషన్ గురించి ఆయన చేసిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జీవా గతంలో ఎక్కువుగా మీడియాతో కలిసేవాడు కాదు. కేవలం ఆయన చేసిన పని మాత్రమే, తన టాలెంట్ ను పది మందికి తెలుపుతుంది, అని నమ్మేవాడు.
జీవా కు ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు రత్న కృపా చక్రవర్తి. ఈయన చిత్ర పరిశ్రమలోనే యానిమేషన్ రంగంలో ఉన్నారు.
రెండవ కుమారుడు రూపంలో, వ్యక్తిత్వములో జీవా లాగానే ఉంటాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జీవా చేసిన నెగిటివ్ క్యారెక్టర్లు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
1998 లో విడుదలయిన సత్య సినిమాలో పోషించిన జగ్గా పాత్రకి,
2004 లో వచ్చిన అబ్ తక్ చెప్పన్ చిత్రంలో పోషించిన పోలీస్ కమీషనర్ సూచెక్ పాత్రకి,
2005 లో వచ్చిన సర్కార్ సినిమాలో స్వామి వీరేంద్ర పాత్రకి, జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది.
తెలుగులో 1981 లో “తొలి కోడి కూసింది” చిత్రం ద్వారా పరిచయమైన జీవా, శివ, నిన్నే పెళ్లాడుతా, గులాబీ, ఇడియట్ చిత్రాల ద్వారా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఓజి (They call him OG), త్రిముఖ, పాంచ్ మినార్ చిత్రాలలో ఆయన నటించారు.








