పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో నటించిన తరువాత బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటానికి వెళ్ళిపోయాను.
ఆ తరువాత విదేశాలకు వెళ్లి ఫిలిం యాక్టింగ్ కోర్స్ చేద్దామని అనుకున్నాను.
బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నపుడే, “మ్యాజిక్”, “యుఫోరియా” తరువాత “ధురంధర్” సినిమాలలో అవకాశం వచ్చింది.
ధురంధర్ డిసెంబర్ 5, 2025న విడుదలైనప్పటి నుండి వసూళ్ల సునామీ తో సందడి చేస్తుంది. అందులో యాలీనా జమాలి పాత్ర చేసిన సారా అర్జున్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఆమె ఈ సినిమాలో పాకిస్తానీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలీ (రాకేష్ బేడీ) కుమార్తె పాత్రను పోషించింది. ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో, ఆమె తన కెరీర్ మొదట్లో చదువును కొనసాగించాలని అనుకున్నప్పుడు, ఆమె ఎందుకు సినిమాలను చేయాలనీ నిర్ణయించుకుందో వివరించింది.
ఈమె పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో బాల నటిగా నటించారు.
సారా అర్జున్ తెలుగు అరంగేట్రం: సారా అర్జున్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యుఫోరియా సినిమాలో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ చిత్రం లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
సారా ఇలా చెప్పింది, ” పొన్నియన్ సెల్వన్ 2 విడుదలైన తర్వాత, నాకు చాలా ఆఫర్‌లు రావడం ప్రారంభించాయి. కానీ నేను నా చదువును కొనసాగించాలి అని అనుకున్నాను , కానీ నాకు అవకాశం వచ్చిన “యుఫోరియా” మరియు “మ్యాజిక్” అనే రెండు చిత్రాలూ, సామాజిక అంశాలతో ముడిపడి సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉన్నాయి.”
“ఇవి మన సమాజంలో తప్పకుండా చెప్పాల్సిన కథలు. కాబట్టి ఒక నటిగా, ఈ కథనాలను తెరపైకి తీసుకురావడంలో నేనుకూడా భాగం కావాలనే భావించాను.”
ఈ సినిమాలలో నటించటం పూర్తి అయినా తరువాత , నటనలో ఉన్నత చదువులు చదవడానికి విదేశాలకు వెళ్లాలని అనుకున్నానని చెప్పింది.
“నేను యుఫోరియా సినిమా తర్వాత విదేశాలకు వెళ్లి ఫిలిం యాక్టింగ్ కోర్స్ చేద్దామని అనుకున్నాను. ఆ సమయంలోనే నాకు దురంధర్ సినిమా అవకాశం వచ్చింది.”
ధురంధర్ ట్రైలర్ నవంబర్ 18న విడుదలైంది. నిజమైన సంఘటనల ఆధారంగా, రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని నలుగురు అత్యంత క్రూరమయిన ఉగ్రవాదులను తుదముట్టించటమే కధాంశం.. ట్రయిలర్లోని పాత్రలను నిజజీవితంలోని వ్యక్తులతో పోలుస్తూ ఊహాగానాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి, కానీ నిర్మాతలు వాటిని ధృవీకరించలేదు. తర్వాత సెన్సార్ బోర్డు ధృవీకరించినట్లుగా, రణవీర్ సింగ్ పాత్ర – మేజర్ మోహిత్ శర్మ నుండి ప్రేరణ పొందిందని భావిస్తున్నారు – ఇది ఒక కల్పిత రచన. పాకిస్తాన్‌లోని వివిధ జాతుల యొక్క సామాజిక-రాజకీయ అంశాలను కూడా ధురంధర్ సినిమాలో చూపించారు..
“ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ” సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ తన ద్వితీయ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాడు..ధురంధర్ సినిమాలో కూడా తన తొలి చిత్రంతో ఉన్నట్టే బలమైన జాతీయవాదం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించి, ఈ సినిమా కనీ వినీ ఎరుగని కలెక్షన్స్ రాబట్టి, బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా సంచలన విజయాన్ని సాధించింది.








