తన కెరీర్ మొత్తం లో చేసిన ఛాలెంజింగ్ రోల్ అపరిచితుడు, అని గతంలో జరిగిన ఒక పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో విక్రమ్ వెల్లడి.
అపరిచితుడు సినిమాలో ఒకే వ్యక్తి మూడు రకాలుగా ప్రవర్తించటం వలన, నటించటానికి మానసికంగా చాలా ఇబ్బంది కలిగింది.
అపరిచితుడు సినిమాలో ప్రతి పాత్ర చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది.
నా కెరీర్లో మరచిపోలేని నటన అపరిచితుడు సినిమా లో చేశాను.
విక్రమ్ అంటే మరిచిపోలేని,అద్భుతమైన నటుడు అని మనందరికీ తెలుసు. అతని కేరీర్లో చేసిన నటనకు అనేకమంది అతని అభిమానులుగా మారి పోయారు. గతంలో పాపులర్ యూట్యూబర్ అయిన రణవీర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కెరీర్లో నటించడానికి చాల కష్టపడిన పాత్ర ఏమిటి ? అనే ప్రశ్న అతనికి ఎదురయింది. దానికి సమాధానంగా విక్రమ్ అపరిచితుడు సినిమాను ప్రస్తావించాడు.
ఆ సంభాషణలో విక్రమ్, అపరిచితుడు సినిమాలో మూడు రకాలయిన మనస్తత్వాలు ఒకే మనిషిలో ఉండటాన్ని, తనపై ఎలా ప్రభావాన్ని కలిగించిందో వివరించాడు. మల్టీఫుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడే వ్యక్తిగా నటించటం కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం అజాగ్రత్తగాఉన్న నవ్వులపాలు అవ్వటం ఖాయం. చాలా జాగ్రత్తగా నటించవలసిన భాద్యత ఉంది. అందుకు పాత్రలలో పూర్తిగా లీనం అవ్వాలి. మూడూ చాలా విభిన్నమయిన పాత్రలు. ఒక పాత్రలోనుండి మరొక పాత్రలోకి మారటానికి మానసికంగా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అందుకని మొదట రామం పాత్రను, తరువాత రెమో పాత్రను, చివరిగా అపరిచితుడు పాత్రను నటించి ఆ చిత్రాన్ని పూర్తిచేసాడు.
విక్రమ్ కష్టాన్ని అర్ధం చేసుకున్న దర్శకుడు శంకర్ ఒక 15 రోజులు షూటింగ్ చేసి మరొక 15 రోజులు బ్రేక్ ఇచ్చేవాడు. బ్రేక్ ఇచ్చిన ఆ 15 రోజుల సమయాన్ని తర్వాత సీన్ల ప్రిపరేషన్ కొరకు వాడుకొనేవాడు విక్రమ్.
ఆసమయంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు ,తన ఇంటి టెర్రస్ పైన ఉండి , సీన్లు ప్రిపేర్ అవుతూ, అక్కడ ఉన్న పావురాలతో ఆడుకొనేవాడు. బ్రేక్ఫాస్ట్,లంచ్,డిన్నర్ మొత్తం టెర్రస్ పైనే. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. రాత్రి అందరూ నిద్రపోయాక తన రూంకి వెళ్లి పడుకునేవాడు. అంతగా ఆ పాత్రలలో లీనమై నటించాడు , అందువలన ఆ పాత్రలలో నుంచి బయటకు రావటానికి అతనికి మానసికంగా చాలా కష్టం అయ్యేది.
శంకర్ దర్శకత్వం లో , 2005 లో వచ్చిన సైకాలాజికల్, యాక్షన్ సినిమా అపరిచితుడు. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విక్రమ్ చేసిన అద్భుతమైన నటనను బట్టి , ఇప్పటికి ఆయన అభిమానులు ఆ చిత్రాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఈ చిత్రం లో ముఖ్య పాత్రల్లో సదా, వివేక్, ప్రకాష్ రాజ్ ,నాసర్ నటించారు.
ఇప్పటికి విక్రమ్ తన చిత్రాల్లో తనకు నచ్చిన చిత్రం గా అపరిచితుడు సినిమా ను ప్రస్తావించడం విశేషం.








