Home Blog ఇయర్ పాడ్స్ లో పాటలు వింటూ నిద్రపోతున్నారా ? జర భద్రం..!!

ఇయర్ పాడ్స్ లో పాటలు వింటూ నిద్రపోతున్నారా ? జర భద్రం..!!

0

ఈ డిజిటల్ యుగంలో చాలా మంది రాత్రి పడుకొనే సమయంలో చెవిలో ఇయర్ పాడ్స్ లేదా ఇయర్ ఫోన్స్,హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు,పోడ్ కాస్ట్ లు ,లెసన్లు వింటూ నిద్రపోతున్నారు. అయితే ఇలా నిద్రపోవటం మంచిదా? లేదా ప్రమాదకరమా?

ప్రయోజనాలు :

1. మంచి ఆహ్లాద కరమైన సంగీతం వింటుంటే మనస్సుకు హాయిగా ఉండి, ప్రశాంతత కలిగి నిద్ర త్వరగా వస్తుంది.

2. మంచి మెలోడీ మ్యూజిక్ వింటే రోజంతా పడిన టెన్షన్లు,ఆందోళనలు తగ్గిపోతాయి.

3. మనకు ఇష్టం లేని శబ్దాలు,ఇతరుల మాటలు,ఇబ్బంది కలిగించే శబ్దాలు నుండి దృష్టి మళ్లుతుంది.

4. మృదువయిన సంగీతం వలన మంచి నాణ్యమైన నిద్ర, డీప్ స్లీప్ లభించవచ్చు.

నష్టాలు :

1. ఎక్కువ సమయం ఇయర్ పాడ్స్ ఉపయోగించడం వలన చెవిలో ఇన్ఫెక్షన్ లేదా ఇయర్ వ్యాక్స్ సమస్యలు రావచ్చు.

2. కొంతమంది బాగా ఎక్కువ సౌండ్ పెట్టుకుని వింటారు. లౌడ్ వాల్యూం లో ఎక్కువసేపు వినటం వలన వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.

3. నిద్రలో పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ఇయర్ పాడ్స్ చెవి లోపలకి గుచ్చుకుని, చెవిపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది, అలాగే నిద్రలో అసౌకర్యంగా కూడా ఉంటుంది.

4. మనం నిద్రపోతున్నప్పుడు కూడా, మన మెదడు శబ్దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దీని వల్ల మెదడుకు విశ్రాంతి దొరకకపోవచ్చు.

5. చౌకగా దొరికే ఇయర్ పోడ్ లు ,ఇయర్ ఫోన్లు ,హెడ్ ఫోన్లు వాడటం వలన ఓవర్ హీటింగ్ సమస్యలు వచ్చి, మెదడు రేడియేషన్కు గురయ్యే అవకాశం ఉంది. ఫోన్ ఛార్జింగ్ లో ఉంచి ఇయర్ పోడ్లు అస్సలు వాడకూడదు.

చెవిలో వినిపించే సౌండ్స్ నిద్రకి భంగం కలిగిస్తాయి. గాఢ నిద్ర పట్టదు. మాములు నిద్ర మన రోజువారీ ఉద్వేగాలను మరిపించి, కలలకు కారణం అవుతుంది. దానికి అంతరాయం కలగటం వలన, మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. ఏ చప్పుడు లేకుండా నిద్ర పోవటం ఎన్నో రెట్లు మంచిది.

నిద్రకు ముందు 20-30 నిముషాలు మృదువయిన సంగీతం వినటం సరే. కానీ రాత్రంతా ఇయర్ పాడ్స్ పెట్టుకుని నిద్రపోవటం మంచిది కాదు, అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాల్యూం ఎప్పుడూ తక్కువుగా ఉంచి సంగీతం వినాలి, టైమర్ సెట్ చేసుకోవాలి, ప్రతిరోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వినాలి. చెవులను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇయర్ పాడ్స్ లో సంగీతం వింటూ నిద్ర పోవటం అంత మంచిది కాదు. దీన్నే అలవాటుగా మార్చుకుంటే చెవులకు సంబందించిన అనారోగ్య సమస్యలు వచ్చి వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. మీకు కూడా ఇలా నిద్రపోయే అలవాటు ఉందా? ఉంటే ,ఈ రోజే సేఫ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే “ఆరోగ్యమే మహా భాగ్యం !”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here