
టాలీవుడ్ లో ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. అతిగా, అవసరం లేకపోయినా టెక్నాలజీ ని సినిమాలలో వినియోగించటం పై బాలయ్య తాజాగా వ్యంగాస్త్రాలు సంధించారు. గోవా లో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలలో అతిధిగా హాజరయిన బాలకృష్ణ మీడియా తో ముచ్చటించారు.
“వినోద పరిశ్రమ అయినా సినిమాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరాన్ని మించి వాడటం వలన, ఏది నిజమో,ఏది టెక్నాలజీ యో తెలియక ప్రేక్షకులను తికమక పడుతున్నారు. నేను సినిమా పరిశ్రమలో గత 50 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. స్వర్గీయ ఎన్టీఆర్ గారి కుమారునిగా ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా గమనిస్తూ, నేను నేర్చుకున్నవి చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం సినిమా నిర్మాణంలో అవసరం లేకపోయినా, టెక్నాలజీని అతిగా వినియోగించటం ఎక్కువ అయ్యింది. నేనయితే టెక్నాలజీని అవసరమయితేనే ఉపయోగిస్తాను. ఎందుకంటే నేను డూప్లికేటుని కాను, నేను ఒరిజినల్. ” అని అన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ నటించిన “అఖండ -2” (తాండవం) చిత్రం, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 5 వ తారీఖున విడుదలకు తుది మెరుగులు దిద్దుకుంటుంది. అభిమానుల్లో ఈ చిత్రం పై విపరీతమయిన అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్, అలాగే ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి , హర్షాలీ మల్హోత్రా నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నవంబర్ 28 వ తారీకు వరకు జరుగుతుంది.